తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) మరియు బీజేపీ (BJP) మధ్య విలీనం (Merger) ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ (Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజాసింగ్ (Raja Singh) మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోంది. కవిత కామెంట్స్ ఆఫ్-ది-రికార్డ్ నిజమేనని సమర్థించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న కవిత ఆరోపణలు నిజమని తాను భావిస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. “పెద్ద ప్యాకేజీ (Big Package) దొరికితే మా వాళ్లు (బీజేపీ) కూడా బీఆర్ఎస్‌తో కలిసిపోతారు” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాజాసింగ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాలను “వాళ్లుష (బీఆర్ఎస్) తీసుకుంటారని, బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు కాదని ఆరోపించారు. “గతంలో ఇదే జరిగింది, అందుకే బీజేపీ నష్టపోయింది. ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలి, కానీ ఇప్పటివరకూ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచించాలి” అని రాజాసింగ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ప్రతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు “కుమ్ముక్కై” నష్టపోయారని, దీని వల్ల పార్టీకి భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా రాజాసింగ్ మాటల్లో అర్థమవుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఈ విషయం తెలుసు, కానీ ఎవరూ బహిరంగంగా చెప్పరు. చెబితే సస్పెన్షన్‌కు గురవుతారు, అందుకే కార్యకర్తలు లేదా అధికారులు నోరు మూసుకుని కూర్చుంటారు అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గత విభేదాలను, తెలంగాణలో పార్టీ వ్యూహాలపై అసంతృప్తిని సూచిస్తున్నాయన్నారు. గతంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2022లో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన సస్పెన్షన్ ఎత్తివేశారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడోసారి రాజాసింగ్ విజయం సాధించారు.








