వర్షాకాలంలో చల్లటి వాతావరణానికి వేడివేడి సూప్ ఎంతో హాయినిస్తుంది. ముఖ్యంగా తాజా కూరగాయలతో తయారు చేసే వెజ్ సూప్ తేలికపాటి ఆహారంగా తీసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, స్వీట్ కార్న్ వంటి కూరగాయలతో పాటు అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ సూప్ తయారు చేసుకోవాలంటే ముందుగా కడాయిలో అర టేబుల్ స్పూన్ బట్టర్ లేదా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ వైట్స్‌ను వేయించాలి. ఆ తర్వాత క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, స్వీట్ కార్న్ వేసి కాసేపు వేయించుకోవాలి.
కూరగాయలు కొద్దిగా వేగిన తర్వాత సుమారు 750 మి.లీ నీటిని పోసి బాగా మరిగించాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసి మరికాసేపు మరిగించాలి. సూప్‌కు మంచి చిక్కదనం రావడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కలిపి పల్చని మిశ్రమంగా తయారు చేసి, మరిగే సూప్‌లో నెమ్మదిగా పోస్తూ కలపాలి. ఒకటి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పైన సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ లేదా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.. వర్షాకాలంలో వేడివేడిగా ఆస్వాదించేందుకు రుచికరమైన వెజ్ సూప్ సిద్ధం.








పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్