రాహుల్ బర్త్‌డే సందర్భంగా మోడీ ట్వీట్..

రాహుల్ బర్త్‌డే సందర్భంగా మోడీ ట్వీట్..

Summarize with AI

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు తన 56వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు (Birthday) తెలిపారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ మోడీ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించిన రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాంగ్రెస్ Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge కూడా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం రాహుల్ చేస్తున్న పోరాటం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళం విప్పుతూ, ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారని ఖర్గే అన్నారు. దేశ సేవలో మరింత శక్తి, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment