స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేతిలో జనసేన ఓటమి

స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేతిలో జనసేన ఓటమి

Summarize with AI

రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల (Local Elections) ఓట్ల లెక్కింపు (Vote Counting) ఉత్కంఠగా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో అధికార కూటమి పార్టీ విజయం సాధించగా.. మరికొన్ని స్థానాల్లో ముందజంలో ఉంది. మరోవైపు కూటమి పార్టీలకు వైసీపీ (YSRCP) గట్టి పోటీని ఇచ్చినట్లు కనిపిస్తుంది.

ఇకపోతే కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ (Thallamapuram MPTC) స్థానంలో పరిస్థితి విభిన్నంగా ఉంది. అక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి(Independent Candidate) శిగినేని సుబ్బమ్మ(Shigineni Subbamma) ఘన విజయం సాధించారు. జనసేన అభ్యర్థి వీరం మౌనికపై 373 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో తాళ్లమాపురంలో సుబ్బమ్మ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

తాళ్లమాపురంలో మొత్తం 3,709 ఓట్లు ఉండగా.. 2,976 ఓట్లు పోలయ్యాయి. కాగా, గతంలో ప్రొద్దుటూరులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తాళ్లమాపురం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అయితే కూటమి అభ్యర్థుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ అనూహ్య ఫలితానికి కారణమయ్యాయనే చర్చ స్థానికంగా జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment