ఏపీలో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు(Red Sanders Smuggling) సంబంధించిన డాక్యుమెంటరీని వక్రీకరిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
డాక్యుమెంటరీలో జగన్ పేరు ఎలా వచ్చింది?
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) మాట్లాడుతూ.. “సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి (Udumula Sudhakar Reddy) రాసిన ‘బ్లడ్ శాండర్స్’ పుస్తకంలో (Blood Sandalwood Book) గానీ, దాని ఆధారంగా రూపొందిన అసలు డాక్యుమెంటరీలో గానీ జగన్ ప్రస్తావనే లేదు. కానీ, ‘జావా డిస్కవరీ’ (Java Discovery) అనే సంస్థ మార్ఫింగ్ ఫోటోలతో జగన్ ని స్మగ్లర్లకు ముడిపెడుతూ కథనాలు అల్లింది. వాటిని పట్టుకుని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్లు పెట్టి విషం చిమ్మడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.

కొల్లం గంగిరెడ్డి ఆ పార్టీ వ్యక్తి..
వైసీపీకి కొల్లం గంగిరెడ్డితో (Kollam Gangireddy) ఎలాంటి సంబంధం లేదని రాచమల్లు స్పష్టం చేశారు. “వైసీపీ ఆవిర్భావం నుంచి నేను ఉన్నాను, గంగిరెడ్డిని ఎప్పుడూ పార్టీలో చూడలేదు. పురందేశ్వరి (Daggubati Purandeswari) బీజేపీ(BJP) అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు గంగిరెడ్డి ఆ పార్టీలో చేరారు. విజయవాడలో ఆమెతో కలిసి సమావేశాల్లోనూ పాల్గొన్నారు. బీజేపీలో ఉన్న వ్యక్తిని జగన్ కి అంటగట్టడం దారుణం” అని రాచమల్లు అన్నారు.
టీడీపీ అధికార ప్రతినిధే అంతర్జాతీయ స్మగ్లర్?
టీడీపీ నాయకులపై రాచమల్లు ఎదురుదాడికి దిగుతూ.. “సుండుపల్లికి చెందిన మహేష్ నాయుడు (Mahesh Naidu) అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదా? అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయో చంద్రబాబుకు తెలియదా? నేరస్తులను, స్మగ్లర్లను పక్కన పెట్టుకుని పవిత్రమైన మాటలు మాట్లాడటం గురివింద గింజ సామెతను గుర్తుచేస్తోంది” అని విమర్శించారు. తమ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రసారం చేసిన సంస్థలపై ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై వైసీపీ తరపున న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.









