రాష్ట్ర విభజనపై (State Bifurcation) అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పాత గాయాలు మానే అవకాశం ఉండదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు అని ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu Naidu) తెలంగాణ (Telangana) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. పార్లమెంటులోనూ, బయటా ఇటీవల కొందరు నేతలు రాష్ట్ర విభజనపై చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసర వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయని, ఈ ధోరణిని మానుకోవాలని సున్నితంగా సూచించారు.
రాష్ట్ర విభజన అనుచితంగా జరిగిందంటూ బీజేపీ (BJP), టీడీపీ(TDP), జనసేన (Jana Sena Party) నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. “ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు తెలుగు వారి మధ్య ద్వేషాలు, వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయి. ఇది ఏ ఒక్కరికీ మంచిది కాదు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన తక్షణ అవసరం ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
లోక్‌సభలో (Lok Sabha) ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను పొన్నం తీవ్రంగా తప్పుబట్టారు. తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఏ ఎంపీ కూడా రాష్ట్ర విభజనపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, బీజేపీ మరియు జనసేన నేతలకు ఈ విషయంలో సర్ది చెప్పే బాధ్యత తీసుకోవాలని పొన్నం కోరారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టడం కంటే, విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు