వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 నుంచి 100 సీట్లు ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 నుంచి 100 సీట్లు ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

Summarize with AI

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం 100 స్థానాల్లో విజయం సాధిస్తామని, కనీసం 90 సీట్లు ఖాయమని పేర్కొన్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాలకు కీలకమని, రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సందీప్ కుమార్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మరోవైపు, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు 96 శాతం భూసేకరణ పూర్తయినా కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వలేదని, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన రూ.12 వేల కోట్ల ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులకు రాజకీయాలకు అతీతంగా కేంద్రం వెంటనే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment