ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే లోకేష్‌తో చ‌ర్చ‌కు నేను సిద్ధం

ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే లోకేష్‌తో చ‌ర్చ‌కు నేను సిద్ధం

Summarize with AI

విద్యాశాఖ‌ను (Education Department) గాలికివ‌దిలేసి అన్ని శాఖ‌ల్లో జోక్యం చేసుకునే ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే(First Time MLA) నారా లోకేష్‌తో(Nara Lokesh) చ‌ర్చ‌కు తాను సిద్ధంగా ఉన్నాన‌ని వైసీపీ(YSRCP) నేత పేర్ని నాని(Perni Nani) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. డీఎస్సీ ఉద్యోగ‌ నియామకాల్లో (DSC Jobs Recruitments) అక్రమాలు (Irregularities) నిరూపిస్తా.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చర్చకు వస్తే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) వస్తారని, లోకేష్ స్థాయికి తానే ఎక్కువ అని సెటైర్లు పేల్చారు.

చీమ చిటుక్కుమన్నా అంతా త‌న లీలే అని చెప్పుకునే నారా లోకేష్‌.. టీడీపీ(TDP) కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై(YS Jagan) వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, లోకేష్ మాటలు హద్దులు దాటుతున్నాయని విమర్శించారు. “దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై నాతో బహిరంగ చర్చకు (Public Debate) రా” అంటూ లోకేష్‌కు సవాల్ (Challenge) విసిరారు. జిల్లాల కలెక్టరేట్లలో మెరిట్ లిస్టులు (Merit Lists) ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు.

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన పేర్ని నాని(Perni Nani).. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం, నియామకాల వరకు ఒకే వ్యవస్థ పని చేసిందని ఆరోపించారు. టెట్, డీఎస్సీ పరీక్షలు రాయకుండానే కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా ఆరోపించారు. “ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి యువత ఉద్యమం తర్వాత రాజీనామా చేశారు. మరి లోకేష్‌ కూడా రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి” అని అన్నారు.

అలాగే మంత్రి పదవి కోసం బోండా ఉమ ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. “మీరు రాజీనామా (Resignation) చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి. ఆ తర్వాత డీఎస్సీపై పూర్తి స్థాయి విచారణ జరిపించండి” అని సవాల్ చేశారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లపై (Sports Quota Certificates) అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వాటిపై స్వతంత్ర విచారణ జరిపించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న అన్ని ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment