ప‌రిపాల‌న అంటే అప‌హాస్య‌మా..?

ప‌రిపాల‌న అంటే అప‌హాస్య‌మా..?

Summarize with AI

ప్రజాస్వామ్యంలో(Democracy) పార్టీలు వేరైనా, వ్యక్తులు ఎవరైనా.. ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టిన తర్వాత పరిపాలన (Governance) పట్ల బాధ్యతగా ఉండటం, ప్రజలకు (People) సేవలను సక్రమంగా అందించడం అత్యంత ముఖ్యం. ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకునికైనా ఇది ప్రాథమిక విధి. కానీ, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విషయంలో మాత్రం పరిపాలన పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. ఆయన నిర్వహిస్తున్న శాఖకు(Department), రాష్ట్ర ప్రజలకు(State People) ఏ రకంగానూ మేలు చేయలేకపోవడం.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎక్కడ..?
పవన్ కల్యాణ్ అనారోగ్య సమస్యలను (Health Issues) పరిగణలోకి తీసుకోవాల్సిందే. కాకపోతే, జూలై 11వ తేదీన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో(Kokilaben Dhirubhai Ambani Hospital) కుడి భుజానికి(Right Shoulder) సర్జరీ (Surgery) చేయించుకున్న నాటి నుంచి రెండు నెలల పాటు తాను నిర్వర్తించే శాఖను పూర్తిగా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 15న ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని (Hyderabad) తన నివాసానికి చేరుకున్న ఆయన.. విశ్రాంతి అనంతరం ఏపీలోని(AP) జనసేన(Jana Sena) కార్యాలయానికి వచ్చినా, కేబినెట్ సమావేశాలకు (Cabinet Meetings) మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. అంతకు ముందు ముక్కుకు శస్త్ర చికిత్స, వెన్ను నొప్పి పేరుతో కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న నెల రోజుల తరువాత రాజమండ్రిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో (Independence Day Celebrations)పాల్గొని, అదే రోజు జ్వరం (Fever) కారణంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఆగస్టు 21వ తేదీన ప్రకృతి వైద్యం కోసం కేరళం రాష్ట్రానికి వెళ్లిన ఆయన, అక్కడ మూడు నుండి నాలుగు వారాలు గడిచినా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై (Drought Situation) ఎలాంటి ధ్యాస పెట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్న డిపార్ట్‌మెంట్‌కు రెండు నెలల పాటు ఏకంగా ఒక దుకాణానికి షెట్టర్ వేసినట్లుగా వ్యవహరించడంపై పరిపాలనా, రాజ‌కీయ వ‌ర్గాల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది.

కరువు కోరల్లో రాష్ట్రం.. పట్టించుకోని కీలక మంత్రి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) చాలా కీలకం. కరువు బారిన పడిన ప్రజలకు ఉపాధి కల్పించడం, ప్ర‌జ‌ల‌కు తాగునీటి కొరత లేకుండా చూడటం, మూలధన వ్యయం పెంచి ప్రజలకు ఉపాధి కల్పించడం, ప్ర‌జ‌ల ఆరోగ్యం (Public Health) దృష్ట్యా రక్షిత తాగునీరు అందించడంపై దృష్టిపెట్టడం చాలా కీల‌కం. అత్యవసర పరిస్థితులు, సంక్షోభాల సమయంలో సమర్థవంతంగా స్పందించేలా ‘కంటింజెన్సీ ప్లాన్'(Contingency Plan) తయారు చేసి కరువు నివారణ చర్యలు చేపట్టడం అనేది చాలా ముఖ్యం.

ఇలాంటి గురుతరమైన బాధ్యతలు పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రి అయిన పవన్ కళ్యాణ్‌పై ఉండగా, ఆ బాధ్యతల నుంచి పూర్తిగా దూరంగా జరగడం పట్ల రైతులు(Farmers), ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ప్రజలు , పరిపాలన, బాధ్యత ల విషయంలో ఈ లెక్కలేనితనం ఉన్నవాళ్లు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు?” అని రాజ‌కీయ విమ‌ర్శ‌కుల్లో చర్చ జోరుగా సాగుతోంది. సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేని నాయ‌కుడు అవ‌స‌ర‌మా..? అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేవలం కులాన్ని వాడుకుని చంద్రబాబుకు అధికారం అప్పగించే ప్రక్రియలో, తన సామాజిక వర్గానికి చంద్రబాబుకు మధ్య కేవలం ఒక మధ్యవర్తిగా ఆయన వ్యవహరించారనే రాజకీయ విమర్శలు కూడా విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి.

నిత్యావసరాల ధరలపై సివిల్ సప్లైస్ మంత్రి మౌనం
జనసేనలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోపాటు ఆ పార్టీ త‌రఫున కేబినెట్‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ మరో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. నిత్యావసర ధరలు (Essential Commodity Prices) విపరీతంగా పెరిగిపోయి పేద, సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్న తరుణంలో.. డీ-మార్టులకు పోటీగా ‘మీ-మార్టులు'(Mee-Marts) అంటూ పబ్బం గడపడం పట్ల మండిపడుతున్నారు. ఉప్పు నుంచి పప్పు వరకు, ఆయిల్ ప్యాకెట్ ధర నుంచి ఉల్లి ధరల వరకు సామాన్యుడు బతకడమే కష్టమవుతున్న ఈ సమయంలో, పౌర సరఫరాల శాఖ మంత్రిగా వాటిని నియంత్రించేందుకు సరైన ప్రణాళికలు రూపొందించకుండా కాలక్షేపం చేయడంపై సగటు పౌరుడు నిలదీస్తున్నాడు.

సెంటిమెంట్లతో మభ్యపెట్టే ధోరణి
“మనం ఏదైనా, ఏం చేసినా ప్రజల్ని నమ్మించొచ్చు, మభ్యపెట్టొచ్చు.. ప్రజా సమస్యలను గాలికొదిలేసినా మనల్ని అడిగేవాడు ఎవడు ఉండడు, ఎవరైనా అడిగితే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవచ్చు” అనే తరహా లెక్కలేనితనం నాయకులలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు ఎండగడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై కనీస ధ్యాస లేకుండా, కేవలం అనారోగ్యం పేరుతో బాధ్యతలను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా?, ప్ర‌జ‌ల బాగోగులు చూడాల్సిన ఓ ప‌విత్ర‌మైన బాధ్య‌తను విస్మ‌రించ‌డ‌మే అవుతుందని విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తారా? లేక పదవులను కేవలం అలంకారప్రాయంగానే వదిలేస్తారా? అనేది కాలమే నిర్ణయించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment