ఎన్టీఆర్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు నాన్‌స్టాప్ సర్‌ప్రైజ్‌లు..

ఎన్టీఆర్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు నాన్‌స్టాప్ సర్‌ప్రైజ్‌లు..

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) ఈసారి మరింత స్పెషల్‌గా మారబోతోందని టాక్ వినిపిస్తోంది. మే 20న ఆయన బర్త్‌డే సందర్భంగా వరుసగా భారీ అప్డేట్స్ (Huge Updates) రాబోతున్నాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ (Title Glimpse) రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీంతో పాటు ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులపై కూడా అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘దేవర 2’(Devara 2)పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక ‘దేవర 2’ విషయానికి వస్తే ఇప్పటికే కొరటాల శివ (Koratala Siva) స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బర్త్‌డే రోజునే ఈ ప్రాజెక్ట్‌పై పవర్‌ఫుల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో చేయబోయే భారీ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War)పై కూడా కీలక ప్రకటన రావచ్చని ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తోంది. మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ చేయబోయే సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి ఈసారి ఎన్టీఆర్ బర్త్‌డే అభిమానులకు పండగే అనేలా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment