ఏపీ డీజీపీ నిద్ర‌పోతున్నాడా..? సాయికృష్ణ కేసులో సుప్రీం సీరియ‌స్‌

ఏపీ డీజీపీ నిద్ర‌పోతున్నాడా..? సాయికృష్ణ కేసులో సుప్రీం సీరియ‌స్‌

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్, కస్టడీ మరణంలో పోలీసుల విచార‌ణ‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు తీవ్రత, పోలీసు యంత్రాంగం వైఫల్యాలు, ఆధారాల మాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మూడు పిటిషన్లను నేరుగా సుప్రీంకోర్టుకే బదిలీ చేయాలని ఆదేశించింది. సాయికృష్ణ‌ను అదుపులోకి తీసుకున్న నాటి నుంచి మృతదేహం లభించకపోవడం, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ కావడం, ఎఫ్‌ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం జరగడంపై పోలీసుల తీరును, డీజీపీ పనితీరును ధర్మాసనం నిలదీసింది.

ఏపీ పోలీసుల‌ వైఫల్యాలపై ధర్మాసనం ఫైర్‌
విచారణ సందర్భంగా బాధితుడి తరఫు, రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా దిగువ పేర్కొన్న అంశాలపై పోలీసు శాఖను నేరుగా ప్రశ్నించింది:

  • టాస్క్ ఫోర్స్ బృందం నాన్-బెయిలబుల్ వారెంట్ పేరిట అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా చట్ట ప్రకారం మజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదు?
  • వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరిస్తున్నప్పుడు.. ఆయన కస్టడీలోకి వెళ్లిన తర్వాత ఏమయ్యారు? ఆయన మృతదేహం ఎక్కడ ఉందో సమాధానం చెప్పలేకపోవడం తీవ్ర ఆందోళనకరం.
  • పోలీస్ స్టేషన్‌లో మే 1 నుంచి జూన్ 1 వరకు సంబంధిత సీసీటీవీ రికార్డులు ఎలా తొలగించబడ్డాయి? కెమెరాలు పనిచేయకుండాపోవడం, రికార్డింగ్‌లు అదృశ్యం కావడం వెనుక ఎవరున్నారు?
  • బాధితుడి తల్లి మే 28నే స్వయంగా రాష్ట్ర డీజీపీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, జూన్ 19 వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అని సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది.

విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడి, వ్యవస్థాగతంగా తప్పు జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఉన్నతాధికారుల పాత్రపై నిలదీత
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌ఓ, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, ఓ ప్రైవేట్ వ్యక్తితో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు.

అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేవలం దిగువ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోదని, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల బాధ్యత ఏమైందని ప్రశ్నించింది. హేబియస్ కార్పస్ పిటిషన్లపై, అలాగే సీబీఐ విచారణ కోరిన దరఖాస్తులపై హైకోర్టులో తీవ్ర ఆలస్యం జరగడం పట్ల నిరసన వ్యక్తం చేసింది.

అక్టోబర్ 12కు తదుపరి విచారణ – కీలక ఆదేశాలు
ఇది కేవలం సాంకేతిక నిబంధనల ఉల్లంఘన కేసు కాదని.. కస్టడీలో వ్యక్తి అదృశ్యం కావడం, సీసీటీవీ ఆధారాలు ధ్వంసం చేయడం, ఎఫ్‌ఐఆర్ ఆలస్యం వంటి అంశాలు తీవ్రమైన విషయాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ

  • ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే స్పందించి, ఈ కేసుతో ముడిపడి ఉన్న అన్ని రికార్డులను సీల్డ్ కవర్‌లో సెప్టెంబర్ 30లోగా సుప్రీంకోర్టుకు సమర్పించాలి.
  • బదిలీ చేసిన మూడు కేసులతో పాటు ప్రస్తుత పిటిషన్‌ను అక్టోబర్ 12, 2026న విచారణకు జాబితా చేయాలి.
  • కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తదుపరి విచారణ సందర్భంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment