నాని అప్పీల్‌పై సీఎం రేవంత్ స్పందన.. ప్రీమియర్‌కు అనుమతిపై కీలక ట్విస్ట్

నాని అప్పీల్‌పై సీఎం రేవంత్ స్పందన.. ప్రీమియర్‌కు అనుమతిపై కీలక ట్విస్ట్

Summarize with AI

హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అభిమానుల మధ్య కూర్చొని చూడాలని ఆసక్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో జరిగే ప్రీమియర్‌ షోను ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీస్‌ అధికారులను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో నాని విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని నాని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను చూడాలని ఉందని నాని తెలిపారు. సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటిస్తామని, భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు, అలాగే ప్రతిభావంతుడైన యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’పై నాని చూపిస్తున్న నిబద్ధతకు సీఎం అభినందనలు తెలిపారు. అభిమానుల రద్దీని సజావుగా నిర్వహించడంతో పాటు ప్రజల భద్రతను నిర్ధారించేందుకు సంబంధిత స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని సీఎం స్పష్టం చేస్తూ డీజీపీని ట్యాగ్‌ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment