మలయాళ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. స్టార్ హీరో నివిన్ పౌలి(Nivin Pauly) నటించిన సరికొత్త చిత్రం ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Family Unit) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల(Collections) సునామీ సృష్టిస్తోంది. తాజా వసూళ్లతో ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో(Kerala State) ఏకంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. చాలా ఏళ్ళ క్రితం ప్రేమమ్ తో(Premam) ఇండస్ట్రీ హిట్ కొట్టిన నివిన్ పౌలి మరోసారి ఇప్పుడు బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ తో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాడు.
కుటుంబ కథాంశంతో(Family Story), హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాలను ఆశ్చర్యపరిచే రీతిలో బాక్సాఫీస్ నంబర్లను నమోదు చేస్తోంది. కేరళలో రూ. 130 కోట్ల మార్కును దాటినప్పటికీ ఈ చిత్రం జోరు ఎంతమాత్రం తగ్గలేదు. ఇదే ఊపు కొనసాగితే కేరళ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 288 కోట్లకు పైగా వసూలు చేసి, అతిత్వరలోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. మలయాళ సినిమా పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డును తిరగరాసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.








