కూట‌మిలో వేధింపుల ప‌ర్వం.. టిడిపి కార్యకర్త ఆవేదన

కూట‌మిలో వేధింపుల ప‌ర్వం.. టిడిపి కార్యకర్త ఆవేదన

తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) నిడదవోలు నియోజకవర్గ (Nidadavole Constituency) కూటమి రాజకీయాల్లో(Alliance Politics) ‘వేధింపుల పర్వం’ (Phase of Harassment)ముదిరి పాకాన పడింది. అధికార పార్టీకి చెందిన జనసేన మంత్రి (Jana Sena Party Minister) అనుచరుడి వేధింపులు భరించలేక, ఒక టిడిపి(TDP) కార్యకర్త బలవన్మరణానికి సిద్ధపడటం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మ‌హ‌త్య‌కు ముందు టీడీపీ కార్య‌క‌ర్త విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియో(Selfie Video) సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని టిడిపి కార్యకర్త కట్టా మణికంఠ(Katta Manikantha) ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ వీడియోలో తన చావుకు మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) ముఖ్య అనుచరుడు కళ్యాణ్ చక్రవర్తి(Kalyan Chakravarthi) కారణమని మణికంఠ బాంబు పేల్చారు. తానూ కూటమి విజయానికి పనిచేసిన వాడినే అయినప్పటికీ, కళ్యాణ్ చక్రవర్తి తనపై అక్రమ కేసులు పెట్టిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మణికంఠ ఆవేదన వ్యక్తం చేశారు.

మణికంఠ సెల్ఫీ వీడియోలో కీలక ఆరోపణలు చేశారు. తాను బీసీ (BC) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతోనే తనపై ఇంతటి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. “బీసీలంటే చులకన భావం కాబట్టే, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు” అని ఆయన వీడియోలో వాపోయారు. ఒకే కూటమిలో ఉండి కూడా టిడిపి కార్యకర్తలను ఇలా ఇబ్బంది పెట్టడంపై స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మణికంఠ జాడ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో నిడదవోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ వ్యక్తికి రక్షణ కల్పించాలని, వేధింపులకు గురిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మణికంఠ తండ్రి కట్టా కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. “నా కొడుకుకు ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోం. కూటమి ప్రభుత్వంలో మా సొంత పార్టీ కార్యకర్తకే రక్షణ లేకపోవడం దురదృష్టకరం. మంత్రి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment