నయనతార – కవిన్ ‘హాయ్’ రిలీజ్ ఫిక్స్..

నయనతార – కవిన్ 'హాయ్' రిలీజ్ ఫిక్స్..

Summarize with AI

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), యువ హీరో కవిన్ (Kavin) తొలిసారి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ (HI)’ విడుదల తేదీని (Release Date) చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా వెల్లడించింది. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన విష్ణు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నయనతార(Nayanthara), విగ్నేష్ శివన్(Vignesh Shivan), ఎస్.ఎస్. లలిత్ కుమార్ (S. S. Lalit Kumar) నిర్మిస్తున్నారు. కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే ఈ సినిమా హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలతో ప్రేక్షకులను అలరించే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రహ్మణ్యం’, ‘యారడి నీ మోహిని’ తరహాలో సాంప్రదాయ విలన్ లేకుండా సాగే వినోదభరితమైన కథతో ‘హాయ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment