ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యవహారశైలిని తప్పుబడుతూ, ఆయన కుమారుడు నారా లోకేశ్ భవిష్యత్తుపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చంద్రబాబును పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సత్యానికి, అసత్యానికి మధ్య తేడా ఒక్క అక్షరమే అయినా, వాస్తవంలో చంద్రబాబుకు, జగన్‌కు ఉన్నంత వ్యత్యాసం ఉంటుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్మకద్రోహానికి ప్రతీకగా అభివర్ణిస్తూ.. ‘‘రేపు నువ్వు పోయాక నీ కొడుకు పరిస్థితి ఆలోచించావా? తలుచుకుంటే నాకే బాధేస్తున్నది’’ అంటూ ప్రశ్నించారు.
వారసత్వంగా అందుకునే ఫలితాలు ఎంత భిన్నంగా ఉంటాయో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కుమారులను చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ ప్రజల హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్నారని, లోకేశ్‌ను అభిమానించే వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కుమారుడిని చంద్రబాబు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు రాజకీయ ప్రవర్తనను తప్పుబడుతూ లక్ష్మీపార్వతి మరింత ఘాటుగా స్పందించారు. హంసలా ఆరు నెలలు బతికినా చాలంటూ వ్యాఖ్యానించారు. చెట్లు, కొండలు భూమికి భారం కాదని, నమ్మకద్రోహులే అసలైన భారమని పేర్కొంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని లక్ష్మీపార్వతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసే అవకాశం ఉంది.
సత్యానికి, అసత్యానికి మధ్య వున్న తేడా ఒక్క అక్షరం మాత్రమే. కానీ వాస్తవం లో ఎంత తేడా అంటే నీకూ, జగన్ కు ఉన్నంత. నమ్మక ద్రోహానికి నీది పుట్టిల్లు కదూ. రేపు నువ్వు పోయాక నీ కొడుకు పరిస్థితి ఆలోచించావా. తలుచుకుంటే నాకే బాధేస్తున్నది. వారసత్వం లో అందుకునే ఫలాలు, ఫలితాలు ఎంత వేరుగా వుంటాయో నీకూ, రాజశేఖర్ రెడ్డి గారికి వున్న కొడుకులను చూస్తే అర్ధం అవుతుంది. ప్రజలందరి హృదయాల్లో ప్రేమను పొందాడు జగన్ బాబు. మరి నీ కొడుకును ఒక్కరయినా అభిమానించే వారున్నారా? అటువంటి సంస్కారాన్ని అతనికి అందించావు, ఇంకా అదే చెడు బాటలో నడిపిస్తున్నావు. ఎందుకయ్యా పాడు జన్మలు. హంసలాగా అరునెలలు బ్రతికినా చాలు. మీవీ ఒక బతుకులేనా? మీలాంటి వారి గురించి భూమి చెబుతుంది. "న భారో తరువచ్చ, న భారో గిరయశ్చ, భారో భారశ్చ విశ్వాస హీనా. చెట్లు, కొండలు భారం కాదు నీలాంటి నమ్మక ద్రోహులే భూమికి భారం
— Nandamuri Lakshmi Parvathi (@NLakshmiParvati) November 11, 2026








