అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..

Summarize with AI

అస్సాంలో బుధవారం (నవంబర్ 11) తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రో జిల్లాలో ఉన్న డిగారు రైల్వే స్టేషన్ వద్ద కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మిజోరంలోని సైరాంగ్ నుంచి కోల్‌కతా వెళ్తున్న 13125 నంబర్ రైలుకు ఉదయం 6:54 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల ప్రాథమిక ప్రకటన ప్రకారం.. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

డిగారు స్టేషన్‌లో మరో రైలుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోకి తీసుకువస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రైలు వేగాన్ని నియంత్రించే క్రమంలో సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారులు, జనరల్ మేనేజర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించడం, రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు సంబంధించిన తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment