4,399 రోజుల మైలురాయి దాటిన మోడీ

4,399 రోజుల మైలురాయి.. మోడీ నాయకత్వాన్ని కొనియాడిన కేంద్ర కేబినెట్

భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మరో కీలక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా (Prime Minister) కొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కేంద్ర కేబినెట్ (Union Cabinet) ప్రత్యేక సమావేశం (Special Meeting) నిర్వహించి ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపింది. దేశ ప్రజలు మోడీపై ఉంచిన విశ్వాసం, ఆశీర్వాదాల ఫలితంగానే ఈ చారిత్రాత్మక ఘనత సాధ్యమైందని కేబినెట్ పేర్కొంది.

గత 12 ఏళ్లలో పేదల సంక్షేమం, సామాజిక అభివృద్ధిని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం పనిచేసిందని కేబినెట్ గుర్తుచేసింది. కోట్లాది కుటుంబాలకు పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు అందించడంతో పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 60 కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పించామని తెలిపింది. యువత, స్టార్టప్‌లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అపూర్వ ప్రోత్సాహం లభించిందని, చంద్రయాన్(Chandrayaan) వంటి విజయాలతో భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రశంసించింది.

దేశ భద్రత, ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ ప్రతిష్ఠ పెంపులో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర కేబినెట్ పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు(GST Implementation), వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (One Rank One Pension) వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes) ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేసిందని తెలిపింది. జీ-20 అధ్యక్షత, అంతర్జాతీయ యోగా దినోత్సవం, సోలార్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని కొనియాడింది. మోడీ నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’(‘Viksit Bharat’) లక్ష్యాన్ని దేశం తప్పకుండా చేరుకుంటుందనే విశ్వాసాన్ని కేంద్ర కేబినెట్ వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment