మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలను (Elections) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ (YSRCP) అధినేత.. రాజధాని అంశంపై కీలక కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికలు ‘మావిగన్ (MAVIGUN) వర్సెస్ అమరావతి (Amaravati)’ మధ్యే జరుగుతాయని, మావిగన్ అజెండాతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని జగన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
“మావిగన్‌కు (MAVIGUN) మేం కట్టుబడి ఉన్నాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల్లో చూసుకుందాం. మావిగన్ మా నినాదం.. మాకు మద్దతు ఇచ్చేవాళ్లు ఓటేస్తారు. ఎన్నికల్లో అమరావతో.. మావిగనో తేల్చుకుందాం” అని జగన్ సవాల్ విసిరారు. జగన్ చేసిన ఈ డేర్ స్టేట్‌మెంట్ (Dare Statement) వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మావిగన్‌పై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగడం, అమరావతికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదన బాగుందనే ఆలోచన ప్రజల్లో మొదలవ్వడంతోనే జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రానికి రాజధానిగా మచిలీపట్నం(Machilipatnam), విజయవాడ(Vijayawada), గుంటూరు (Guntur) ప్రాంతాలు ఎంతో అనువైనవని జగన్ ప్రతిపాదించారు. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయని, కేవలం 10 శాతం పెట్టుబడితోనే రాజధానిని పూర్తి చేయవచ్చని ఆయన వివరిస్తున్నారు.
మచిలీపట్నంలో తీర ప్రాంతం (కోస్టల్ కారిడార్) సౌకర్యం, విజయవాడలో ఎయిర్‌పోర్టు (Airport), రైల్వే కనెక్టివిటీ(Railway Connectivity), గుంటూరు (Guntur) పారిశ్రామిక కారిడార్ (Industrial Corridor) వంటి వసతులు మెండుగా ఉన్నాయనే చర్చ ఈ ప్రతిపాదన బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజల్లో బలంగా నడుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) అమరావతి నిర్మాణం (Amaravati Construction) పేరుతో మొదటి విడతలో 50 వేల ఎకరాలు, ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కలిపి మొత్తం 1 లక్ష ఎకరాల భూమిని సేకరించిందని, ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారని వైసీపీ(YSRCP)నేతలు గుర్తు చేస్తున్నారు.
ఫలితం లేని చోట రూ.2 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు, ఆర్థిక నిపుణుల్లోనూ ఆలోచన మెదులుతోంది. అదే సమయంలో, ఇందులో 10 శాతం అంటే రూ.20 వేల కోట్లు ఖర్చు పెడితే, మరుసటి రోజు నుంచే మావిగన్ ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుతుందని వైసీపీ దృఢంగా వాదిస్తోంది. ఇప్పటికే మావిగన్ ప్రాంతం నుంచి రాష్ట్రానికి 16 శాతం ఆదాయం సమకూరుతోందని వైసీపీ చెబుతోంది.
ప్రజల నుంచి మావిగన్‌కు వస్తున్న ఆదరణను గమనించే జగన్ అంతటి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి అమరావతిని నమ్ముకున్న కూటమికి, మావిగన్ నినాదంతో వస్తున్న జగన్‌కు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.








