మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన యువతి మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం తొడిగారు. తాజాగా జైపూర్‌లో జరిగిన ఈ అందాల పోటీలో మణిక విజయం సాధించారు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.
మణిక విశ్వకర్మ గురించి..
స్థలం: మణిక రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందినవారు, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు.
విద్య: ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
ఎన్‌సీసీ: ఆమె ఒక ఎన్‌సీసీ క్యాడెట్ కూడా.
సేవా కార్యక్రమాలు: మణిక న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి, ఏడీహెచ్‌డీ (ADHD) వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడేవారికి సహాయం అందిస్తున్నారు.
మణిక తన అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తారని ఆశిద్దాం.








