సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి (Thungathurthi) నియోజకవర్గంలోని లింగంపల్లి (Lingampalli) గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో (Sarpanch Election Campaign) దారుణ హత్య జరిగింది. కాంగ్రెస్–బీఆర్‌ఎస్ కార్యకర్తల (Congress-BRS Party Workers) మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతం దాకా వెళ్లి, బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటన అనంతరం పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “కాంగ్రెస్ అరాచకాలను ఎవ్వరూ ఉపేక్షించరు. అధికార మదంతో గూండా దాడులకు దిగడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచే చర్య” అని మండిపడ్డారు. సంఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌లతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు.
కేటీఆర్ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ.. “మా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడటం పార్టీ బాధ్యత. మల్లయ్య కుటుంబానికి, గాయపడిన వారికి అన్ని విధాలా అండగా ఉంటాం” అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఘర్షణకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఎన్నికలను ప్రజాస్వామ్యపద్ధతిలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రారంభమైన చిన్న మాటామాటే రక్తపాతం దాకా వెళ్లడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.









కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల