తమిళ స్టార్ హీరో, తమిళనాడు (Tamil Nadu) సీఎం దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు తొలి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్(Vijay) ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో, ఆయనను చివరిసారిగా వెండితెరపై చూస్తున్నామనే భావన అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. సినిమా ముగిసిన అనంతరం పలువురు అభిమానులు కన్నీళ్లు పెట్టుకోవడం, థియేటర్లలో విజయ్‌కు భావోద్వేగ వీడ్కోలు (Emotional Farewell) పలకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ చెన్నైలోని రోహిణి థియేటర్లో (Rohini Theatre) ‘జన నాయగన్’ను వీక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానుల సందడి మధ్య థియేటర్‌కు చేరుకున్న త్రిష చిరునవ్వుతో (Trisha Smile) వారికి అభివాదం చేయగా, సినిమా ముగిసిన తర్వాత కూడా ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్-త్రిష (Vijay Trisha) కాంబినేషన్‌పై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుండటంతో, ఆమె థియేటర్లో సినిమా చూడటం మరింత హాట్ టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్(Bobby Deol), ప్రకాశ్ రాజ్(Prakash Raj), గౌతమ్ వాసుదేవ్ మేనన్(Gautham Vasudev Menon), మమితా బైజు (Mamitha Baiju) తదితరులు కీలక పాత్రలు పోషించగా, తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.







