కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు

రేవంత్ సర్కార్ కళ్యాణలక్ష్మి పధకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు: కేటీఆర్

Summarize with AI

కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మానవీయ పాలనకు కళ్యాణలక్ష్మి పథకం నిలువెత్తు నిదర్శనమని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఓ గిరిజన తండాలో తాను చూసిన ఘటన నుంచి ప్రేరణ పొందిన కేసీఆర్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహ సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడిందని, బాల్య వివాహాలను తగ్గించడంలోనూ దోహదపడిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలు లబ్ధి పొందాయని వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తులం బంగారం సంగతి అటుంచితే, ప్రస్తుతం ఉన్న కళ్యాణలక్ష్మి పథకాన్నే కొనసాగించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

పేదింటి ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచిన ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment