రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూర్య (Suriya) మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’(Karuppu) ఇప్పుడు ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆర్.జె. బాలాజీ(R.J. Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీ స్పందనను సొంతం చేసుకుంది.
చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి మాస్ అవతారంలో కనిపించిన సూర్య తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకోగా, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ కథనం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు (Gross Collections) సాధించిన ఈ మూవీ 2026లో తమిళ సినీ పరిశ్రమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే ‘కరుప్పు’ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకోగా, జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ (Streaming) ప్రారంభం కానుంది.
తమిళంతో (Tamil)పాటు తెలుగు (Telugu)సహా పలు భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సినిమాలో త్రిష(Trisha), ఇంద్రన్(Indrans), స్వాసిక (Swasika) కీలక పాత్రల్లో నటించారు. సాయి అభ్యంక్కర్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ‘కరుప్పు’ ఓటీటీలో కూడా అదే రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.








