కల్పనా చావ్లా స్ఫూర్తితో ‘ఆకాశంలో ఒక తార’.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

కల్పనా చావ్లా స్ఫూర్తితో ‘ఆకాశంలో ఒక తార’.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Summarize with AI

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో, పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)నవంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్(Geetha Arts), స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు.

సినిమా విడుదల నేపథ్యంలో మాట్లాడిన దర్శకుడు పవన్ సాధినేని.. ఈ కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా సమయంలో వ్యోమగామి కల్పనా చావ్లా (Kalpana Chawla) బయోగ్రఫీ చదువుతున్నప్పుడు, ఆమె కలలను సాకారం చేసుకునే ప్రయాణంలో భర్త అందించిన ప్రేమ, ప్రోత్సాహం తనను ఎంతగానో కదిలించాయని తెలిపారు. ఆ ఆలోచన నుంచే ‘ఆకాశంలో ఒక తార’ కథకు బీజం పడిందని, ఒక అమ్మాయి తన కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ‘కృష్ణ’(Krishna) పాత్ర ఎలా అండగా నిలిచిందనేదే సినిమా ప్రధానాంశమని చెప్పారు. ఈ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసించారు.

అంతరిక్షానికి సంబంధించిన అంశాలు(Space-Related Topics), సాంకేతిక విషయాలపై (Technical Aspects) అవగాహన కోసం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో కలిసి రెండేళ్లపాటు పరిశోధన చేశామని పవన్ సాధినేని వెల్లడించారు. ఏడాదిన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన తర్వాతే చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. కథ నచ్చడంతో అల్లు అరవింద్ (Allu Aravind) ఎలాంటి మార్పులు సూచించకుండానే సినిమాకు అంగీకరించారని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment