ఆ వీడియోలు తీసేయాల‌ని కోర్టుకెక్కిన జ‌న‌సేన ఎమ్మెల్యే

ఆ వీడియోలు తీసేయాల‌ని కోర్టుకెక్కిన జ‌న‌సేన ఎమ్మెల్యే

Summarize with AI

రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ లాంటి పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయ వేదిక నుంచి వీడియో కాల్స్ చేసి అసభ్యకర చేష్టలు చేసిన అరవ శ్రీధర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోల అంశంపై ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఆ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌లో ప్రధానాంశాలు..
ఎమ్మెల్యే శ్రీధర్ తన పిటిషన్‌లో పలు కీలక విన్నపాలను కోర్టు ముందు ఉంచారు. టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమవుతున్న ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. హర్షవీణ అనే మహిళ అందించిన వివాదాస్పద కంటెంట్‌ను భవిష్యత్తులో మళ్లీ అప్‌లోడ్ చేయకుండా లేదా ప్రసారం చేయకుండా స్టే ఇవ్వాల‌ని కోరారు. తన వ్యక్తిగత గోప్యతకు (Right to Privacy) భంగం కలుగుతోందని, దీనివల్ల సామాజికంగా తన ప్రతిష్ట దెబ్బతింటోందని పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

కోర్టులో వాదనలు
శ్రీధర్ తరఫున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ వీడియోల ప్రసారం వల్ల పిటిషనర్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత ఎమ్మెల్యే వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించాలని రైల్వేకోడూరు పోలీసులను ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment