పవన్ పదవిని అడ్డుపెట్టుకుని రూ.185 కోట్ల స్కామ్‌

jada-sravan-alleges-185-crore-janasena-jobs-scam-targets-pawan-kalyan-cid-investigation

Summarize with AI

జనసేనలో కలకలం రేపుతున్న రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్‌పై జడ శ్రవణ్ (Jada Sravan) సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిని అడ్డుపెట్టుకుని జనసేన(Jana Sena) కీల‌క‌ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా రూ.170 కోట్ల నుంచి రూ.185 కోట్ల వరకు వసూలు చేశారని పేర్కొన్నారు. 2024లో జనసేన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వసూళ్లకు సంబంధించి బాధితులతో మాట్లాడిన అనంతరం తమకు ప్రాథమిక వివరాలు అందాయని తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో జ‌డ శ్ర‌వ‌ణ్ (Jada Sravan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు, డీఎస్సీ, వివిధ కార్పొరేషన్లు, గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం జనసేన నాయకులు డబ్బులు వసూలు చేశారని జడ శ్రవణ్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) పోస్టుల నియామకాల్లోనూ వందల మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించారు. డబ్బులు చెల్లించి ఉద్యోగాలు పొందిన వారు బయటకు రావడానికి సిద్ధంగా లేరని, ఇప్పటికే వారికి ఉద్యోగాలు లభించడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు.

కోట్ల రూపాయల వసూళ్ల వ్యవహారం బయటపడగానే ఓ దళిత మహిళ ధ‌ర‌ణీకృష్ణ‌పై (Dharani Krishna) నిందలు మోపి, మొత్తం వ్యవహారాన్ని ఆమెపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జడ శ్రవణ్ మండిపడ్డారు. సాధారణ ఉద్యోగిని రాత్రికిరాత్రి పోలీసులు తీసుకెళ్లి నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారన్నారు. అధికారం, పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉన్నాయని ఓ దళిత మహిళను కేసులో ఇరికిస్తే సమాజం చూస్తూ ఊరుకోదని పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) హెచ్చరించారు.

ప్రజాస్వామ్య దేశంలో(Democratic Country) అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని జడ శ్రవణ్ స్పష్టం చేశారు. సొంత పార్టీ నాయకులపై ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది సినిమా కాదని, రాజకీయమని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నంత మాత్రాన విమర్శలు ఆగవని పేర్కొన్నారు.

ఉద్యోగాల స్కామ్‌పై (Job Scam) ప్రభుత్వం సీఐడీ (CID) విచారణకు ఆదేశించడాన్ని జడ శ్రవణ్ తప్పుబట్టారు. సీఐడీ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కాదని, చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌గా (Chandrababu Investigation Department) మారిందని ఎద్దేవా చేశారు. ఈ విచారణలో కోట రుక్మిణి(Kota Rukmini), కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే)లకు (Kalyanam Siva Srinivas – KK) క్లీన్‌చిట్ ఇచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

విశాఖ భాగస్వామ్య సదస్సులో అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ముందువరుసలో ఉంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఈ నేపథ్యంలో సీఐడీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా? అని జడ శ్రవణ్ ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment