భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌పై నీలినీడలు.. భద్రతా పరిస్థితులతో ఉత్కంఠ!

భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌పై నీలినీడలు.. భద్రతా పరిస్థితులతో ఉత్కంఠ!

Summarize with AI

భారత్-ఐర్లాండ్ (India-Ireland) మధ్య జరగనున్న టీ20 సిరీస్‌పై (T20 Series) అనిశ్చితి నెలకొంది. ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు(Riots), హింసాత్మక ఘటనలు (Violent Incidents) క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బెల్‌ఫాస్ట్‌లో (Belfast) జరిగిన కత్తిపోటు ఘటన అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వాటర్ కేనన్లు, ప్లాస్టిక్ బుల్లెట్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 26, 28 తేదీల్లో జరగాల్సిన భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ సజావుగా జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా సిరీస్ వాయిదా పడే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది.

అయితే పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) స్పష్టం చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడకపోతే వేదిక మార్పు లేదా అదనపు భద్రతా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ(BCCI) ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో జట్టును ప్రకటించడంతో అభిమానులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్ క్రికెట్‌కు ఆర్థికంగా ఎంతో కీలకమైన ఈ పర్యటనను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఐర్లాండ్ భద్రతా పరిస్థితులపైనే నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment