డల్లాస్‌లో జరిగిన ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “‘గేమ్ ఛేంజర్’లో మీరు థియేటర్లో చూసే అనేక సంఘటనలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అయితే, ఆ సీన్స్‌ను దర్శకుడు శంకర్ నాలుగేళ్ల క్రితమే రాశారు. ఈ సినిమా హై ఓల్టేజీ ఎమోషన్‌తో ప్రేక్షకుల నుండి విశేషమైన క్లాప్స్ సంపాదిస్తుంది. ఇది తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల వారికి విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది” అని చెప్పారు.
దిల్ రాజు ప్రకటన ప్రకారం, ఈ సినిమా కేవలం ఓ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, సమాజాన్ని ప్రతిబింబించే అంశాలతో కూడా నిండిపోవడాన్ని స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకుల మనసుకు పెద్దగా తగిలే విధంగా ఉండబోతుందని సూచిస్తున్నారు.








