TDP ఎంపీ పుట్టాకు డ్ర‌గ్స్ పాజిటివ్.. సిమ్లా నుంచే కొకైన్

TDP ఎంపీ పుట్టాకు డ్ర‌గ్స్ పాజిటివ్.. సిమ్లా నుంచే కొకైన్

మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ (Moinabad Drugs Party) కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏలూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) ఎంపీ (MP) పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు (Putta Mahesh Kumar Yadav) డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీమ్ ఎస్పీ (Eagle Team SP)గిరిధర్ (Giridhar) అధికారికంగా ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఫామ్‌హౌస్‌లో ఉన్న మొత్తం 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఇందులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉండటం గమనార్హం. ఈ పార్టీ కోసం డ్రగ్స్‌ను సిమ్లా నుంచి తరలించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొకైన్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో అధికారులు ఉన్నారు.

ఎంపీ అయినా విడిచిపెట్టేది లేదు..
శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో అందిన పక్కా సమాచారంతోనే పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. పోలీసులు లోపలికి ప్రవేశించే క్రమంలోనే తుపాకీ పేలిన శబ్దాలు (గన్ ఫైర్) వినిపించాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. “నిందితులు ఎవరైనా సరే.. వారు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఆయన హెచ్చరించారు.

మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని అతిథి గృహంలో శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మ, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా పలువురు వీఐపీలు పాల్గొన్నారు. పార్టీలో గాలిలోకి కాల్పులు జరగడం, భారీగా కొకైన్ లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిపై ఎన్‌డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment