భార‌త్‌లో రెండు HMPV కేసులు? బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు గుర్తింపు

భార‌త్‌లో HMPV వైరస్ కేసు? బెంగళూరులో 8 ఏళ్ల‌ చిన్నారికి గుర్తింపు

బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్) వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌ల‌లో ఈ వైరస్‌పై పరీక్షలు జరగలేదని, ఈ నివేదిక ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అందినదని పేర్కొంది. చైనా, జపాన్ దేశాల‌కే పరిమితమైన ఈ HMPV వైరస్ బెంగళూరు ఇద్ద‌రు చిన్నారుల‌కు సోకడంపై ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

పాపకు వైరస్ ఎలా సోకిందనే వివరాలు ఇంకా తెలియరాలేదని, వైరస్ స్ట్రైయిన్ వైద్య నిపుణులకు అంతుబట్టడంలేదని కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ వైర‌స్ చిన్నారులు, వృద్ధుల‌కు ఎక్కువ‌గా సోకుతులున్న‌ట్లుగా చైనా ధ్రువీక‌రించింది. HMPV వైరస్ సాధారణంగా శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment