ఏపీ, తెలంగాణలో SIR.. ఓటర్ల జాబితా సవరణకు ఈసీ గ్రీన్ సిగ్నల్

ఏపీ, తెలంగాణలో SIR.. ఓటర్ల జాబితా సవరణకు ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్
ఏపీలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు), BLAలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు.

తెలంగాణలో..
తెలంగాణలో జూన్ 25 నుంచి సవరణ ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు ECI వెల్లడించింది. మే 20 నుంచి జూన్ 29 వరకు సిబ్బందికి శిక్షణ, ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు BLOలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. జూలై 29 నాటికి పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పుల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆగస్టు 5న ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుంది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని అక్టోబర్ 3 నాటికి పరిష్కరిస్తారు. అక్టోబర్ 7, 2026న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

భారీ యంత్రాంగం రంగంలోకి..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఈ విధుల్లో దాదాపు 35,985 మంది BLOలు, 25,886 మంది BLAలు పాల్గొననున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించాలని ఈసీ సూచించింది. ఓటరు జాబితాలో పేరు లేని వారు, చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు, అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment