కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) ఘనంగా ప్రమాణస్వీకారం (Oath Ceremony) చేశారు. బెంగళూరులోని (Bengaluru) లోక్‌భవన్‌లో (Lok Bhavan) నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ (Governor) థావర్‌చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని విజయతీరాలకు చేర్చిన డీకే శివకుమార్ ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వేడుకకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), మాజీ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah), కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు.
కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టిన డీకే శివకుమార్ పాలన ఎలా ఉండబోతోందన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని కొత్త ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది.








