కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లవ్ స్టోరీ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాకముందే.. వీరిద్దరి బంధానికి బ్రేక్ పడిందనే షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ధనుష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా (ఫిల్మ్‌ఫేర్) కథనాలు వెల్లడించాయి.
ఈ ఇద్దరు స్టార్స్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే ఊహాగానాలు గత ఏడాది కాలంగా వినిపిస్తున్నాయి. సినిమా కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
మృణాల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా హాజరుకావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీలో కూడా మృణాల్ సందడి చేసింది.
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2022లో ధనుష్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృణాల్‌తో ఆయన పేరు ముడిపడటం, పెళ్లి వార్తలు రావడం.. ఇప్పుడు ఉన్నట్టుండి బ్రేకప్ రూమర్స్ తెరపైకి రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
గతంలో మృణాల్ ఠాకూర్ ఈ డేటింగ్ వార్తలపై స్పందిస్తూ.. “ధనుష్ కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. వరుస సినిమాలతో డైరీ ఫుల్ అయిపోవడం వల్ల డేటింగ్ చేయడానికి కూడా నాకు సమయం లేదు” అంటూ నవ్వుతూ కొట్టిపారేసింది.
ప్రస్తుతం ధనుష్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీలలతో కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఓమ్ – చాప్టర్ 1’ షూటింగ్‌తో బిజీగా ఉండగా.. మృణాల్ ఠాకూర్ కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. మరి ఈ తాజా బ్రేకప్ వార్తలపై ఈ ఇద్దరు స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.








