విడుద‌ల‌కు ముందే ఓటీటీ హక్కులు అమ్మేసిన ‘కుబేర’

విడుద‌ల‌కు ముందే ఓటీటీ హక్కులు అమ్మేసిన ‘కుబేర’

Summarize with AI

సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘కుబేర’(Kubera) తాజాగా ఓటీటీ(OTT) డీల్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్(Dhanush), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 20న పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్
తాజా సమాచారం ప్రకారం, ‘కుబేర’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం మొదట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన తర్వాత మాత్రమే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

ప్రముఖ నటుల కాంబినేషన్, శేఖర్ కమ్ముల(Shekhar Kammula) మార్క్ స్టోరీటెల్లింగ్‌‍తో ‘కుబేర’ సినిమాపై భారీ హైప్ నెలకొంది. థియేటర్లలో ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment