బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకాలో(Dhaka) హిందూ సంఘాలు (Hindu Organizations) భారీ నిరసన ర్యాలీ (Protest Rally) నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గైబాంధా జిల్లాలో (Gaibandha District) నిర్మాణంలో ఉన్న 81 అడుగుల శ్రీరామ (Lord Rama) విగ్రహానికి వ్యతిరేకంగా కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపులు (Islamist Groups) చేపట్టిన నిరసనలు, అలాగే శ్రీరాముడి (Lord Rama) చిత్రాన్ని అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. వేలాది మంది హిందువులు ర్యాలీలో పాల్గొని మతపరమైన స్వేచ్ఛను కాపాడాలని, మైనారిటీలపై (Minorities) జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిందూ నాయకులు హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
ర్యాలీలో పాల్గొన్న సంఘాలు దేవాలయాల భద్రత (Temples Security), హిందూ ఆస్తుల రక్షణ(Hindu Properties Protection), మతపరమైన అవమానాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. గత కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, ఆలయాల ధ్వంసం వంటి ఘటనలు పెరుగుతున్నాయన్న ఆందోళనల మధ్య ఈ నిరసనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మైనారిటీల హక్కులకు చట్టపరమైన హామీలు కల్పించాలని, భద్రతను బలోపేతం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ భారీ ర్యాలీతో బంగ్లాదేశ్‌లో మత సామరస్యం, మైనారిటీల భద్రత అంశాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర