ప‌వ‌న్ మాట్లాడిందే.. రావణ్ మాట్లాడాడు.. చెప్పు చూపలేదు అంతే..

ప‌వ‌న్ మాట్లాడిందే.. రావణ్ మాట్లాడాడు.. చెప్పు చూపలేదు అంతే..

Summarize with AI

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై (Prashna Ravan) యూఏపీఏ (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ(Narayana) తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు రావణ్ ప్రస్తావించాడని, అయినప్పటికీ అతనిపై కఠిన చట్టాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

రావ‌ణ్ (Prashna Ravan)అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడిన నారాయణ, “ప్రశ్న రావణ్ (Prashna Ravan) ఏ తప్పు మాట్లాడాడు? గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడిందే పొల్లు పోకుండా మాట్లాడాడు. తేడా ఒక్కటే… పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారు, రావణ్ మాత్రం చెప్పు చూపించలేదు” అంటూ వ్యాఖ్యానించారు.

రావణ్‌పై వరుసగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని, కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసులో మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. చివరకు యూఏపీఏ(UAPA) వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై జనసేన కార్యకర్తలు దాడికి య‌త్నించ‌డం ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచివి కావని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amit Shah) “డౌన్ డౌన్” (Down Down) నినాదాలు చేసిన వారిపై నమోదైన కేసులను ప్రస్తావించిన నారాయణ, ఆ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. విమర్శలు, నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన కఠిన చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ, అధికార వ్యవస్థ తీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “చట్టపరమైన చర్యలు ఉండాలి. కానీ అవి పక్షపాతం లేకుండా ఉండాలి. రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా ఉపయోగించకూడదు” అని నారాయణ హిత‌వుప‌లికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment