తెలంగాణలో(Telangana) వ్యవసాయ (Agriculture) రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో (Hyderabad) వ్యవసాయ శాఖ (Agriculture Department) అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సన్నవడ్లు పండించే రైతుల పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. రైతులకు(Farmers) నాణ్యమైన విత్తనాలు (Quality Seeds) సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో(Rythu Vedikas) నిల్వలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఏడు రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై (Subsidy) రైతులకు అందించాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు. రైతులకు సేవలు వేగంగా చేరేందుకు డిజిటల్ వ్యవస్థలను (Digital Systems) బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయిల్ ఫెడ్‌ను (Oil Fed) మరింత శక్తివంతం చేసి నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అలాగే ఎరువుల సరఫరాలో పారదర్శకత, సమర్థత కోసం అన్ని ఫెర్టిలైజర్ కేంద్రాలకు యాప్‌లను అనుసంధానం చేయాలని ఆదేశించారు. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.








