కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 గంటలకు అమరావతి నుంచి కుప్పానికి చేరుకుంటారు. మొదటిగా, ద్రవిడ యూనివర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. అనంతరం, కుప్పం మండలం నడిమూరు గ్రామంలో సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సాయంత్రం, సీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమంలో ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాత్రి, ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు.

7వ తేదీ ఉదయం 10.00 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రి, కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment