చిత్తూరు (Chittoor) నగరవనంలో మైనర్ బాలిక (Minor Girl)పై జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులైన కిషోర్ (Kishore), మహేష్ (Mahesh), హేమంత్ (Hemanth)లను అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
ఫారెస్ట్ సిబ్బందిగా నటిస్తూ నగరవనం పార్క్‌కు వచ్చే వారిని వేధింపులకు గురి చేస్తూ, మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ (Gang Rape)కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో ఈ నిందితులు మరికొంత మందిని కూడా వేధించినట్లు బయటపడుతోంది.
ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల సెల్ఫోన్లలో ఏడు వీడియో క్లిప్‌లు దొరకగా, అవి కేసులో ప్రధాన సాక్ష్యాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు నిందితుల దారుణాలను బయటపెడుతున్నాయి.
ప్రస్తుతం కేసు లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. స్థానికులు నగరవనంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు