బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ప్రముఖ మోటోవ్లాగర్‌పై కేసు

బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ప్రముఖ మోటోవ్లాగర్‌పై కేసు

Summarize with AI

తెలుగు మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో సూర్యాపేట జిల్లా నూత‌నక‌ల్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని TGSRTC MD సజ్జనార్ కూడా తీవ్రంగా పరిగణించారు. “కాసులకు కక్కుర్తిపడి అమాయకుల జీవితాలతో ఆడుకోవడం నడవదు. చట్టపరంగా తప్పక శిక్ష అనుభవించాల్సిందే” అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కారణంగా చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ కేసు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై మరింత నిఘా పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment