కెనడాలోని(Canada) సరీ ప్రాంతంలో ఓ భారతీయ మూలాలున్న(Indian-origin) మహిళకు, ఆమె ఇంట్లో ఉంటున్న అద్దెదారుడికి మధ్య బార్బెక్యూ(Barbecue) విషయంలో వివాదం తలెత్తింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మహిళ(Woman) అద్దెదారుడితో(Tenant) వాగ్వాదానికి దిగడం, బార్బెక్యూ గ్రిల్(Barbecue Grill) వద్దకు వెళ్లి మాంసాన్ని తొలగించే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం వివాదం మరింత ముదిరి అద్దెదారుడి ఇంట్లోకి ప్రవేశించడం, రాయి విసరడం వంటి ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. చివరికి పోలీసులు(Police) ఆమెను అదుపులోకి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో ‘బీఫ్ (Beef) వండుకోవడాన్ని వ్యతిరేకించి మహిళ గొడవకు దిగింది’ అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సరీ పోలీస్ సర్వీస్ (Surrey Police Service) మాత్రం ఈ వివాదానికి మతం, బీఫ్ లేదా సిద్ధాంతపరమైన అంశాలతో సంబంధం లేదని స్పష్టం చేసినట్లు ఫ్యాక్ట్‌చెక్ నివేదికలు వెల్లడించాయి. పోలీసుల ప్రకారం ఇది ప్రధానంగా కొనసాగుతున్న ఇంటి యజమాని–అద్దెదారుడి వివాదానికి సంబంధించిన ఘటన. పోలీసులు పలుమార్లు అక్కడికి వెళ్లినట్లు, ఒక సందర్భంలో అరెస్టు కూడా జరిగినట్లు తెలిపారు.








