‘టీఆర్‌ఎస్’ పేరుపై కొత్త రచ్చ.. కవితకు బీఆర్‌ఎస్ షాక్!

‘టీఆర్‌ఎస్’ పేరుపై కొత్త రచ్చ.. కవితకు బీఆర్‌ఎస్ షాక్!

Summarize with AI

ఎమ్మెల్సీ కవిత(Kavitha) ప్రకటించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీకి ప్రారంభం నుంచే ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరును ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India – ECI) వందల సంఖ్యలో ఫిర్యాదులు (Complaints) చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే దాదాపు 700 ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొత్త చర్చకు దారితీయగా, కవిత పార్టీ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు, భారత రాష్ట్ర సమితి (BRS) కూడా ‘టీఆర్‌ఎస్’ (TRS) పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన ‘టీఆర్‌ఎస్’ పేరు ప్రజల భావోద్వేగాలకు సంబంధించినదని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ను(BRS) టీఆర్‌ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఇదే సమయంలో మహారాష్ట్రకు (Maharashtra) చెందిన మరో సంస్థ కూడా ‘టీఆర్‌ఎస్’ పేరును కోరుతూ ముందుగానే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో కవిత పార్టీకి పేరు విషయంలోనే పెద్ద సవాల్ ఎదురవుతుండగా, ఈసీఐ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment