“భారత్ ఆప్కా బాప్ హై” – ఉప్పొంగుతున్న దేశ‌భ‌క్తి

"భారత్ ఆప్కా బాప్ హై" – ఉప్పొంగుతున్న దేశ‌భ‌క్తి

Summarize with AI

పాకిస్థాన్‌పై (Pakistan) భారత్ (India) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor)’కు దేశవ్యాప్తంగా భారతీయులు (Indians) మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దేశభక్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. “భారత్ దెబ్బ అదుర్స్” అంటూ నెటిజన్లు తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఉరి’ మరియు ‘స్కై ఫోర్స్’ వంటి సినిమాల్లోని సన్నివేశాలను పంచుకుంటూ, నిజ జీవిత ఘటనలతో అనుసంధానం చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా వైరలవుతున్న వీడియో ఒకటి “భారత్ ఆప్కా బాప్ హై (“Bharat aapka baap hai)” అంటూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాక్ సైన్యంపై దాడి చేసే సీన్‌ను చూపిస్తుంది. ఈ దృశ్యం ప్రజల్లో దేశభక్తిని రగిలించడమే కాకుండా, పాకిస్థాన్‌పై మన ఆర్మీ యొక్క ధైర్యాన్ని హైలైట్ చేస్తోంది. ఈ వీడియోతో పాటు దేశం మొత్తం “జై హింద్ (Jai Hind)” అనే నినాదాలతో మార్మోగుతోంది.

ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంతంతో ఇండియ‌న్స్‌లో దేశభ‌క్తి ఉప్పొంగుతోంది. పాకిస్తాన్ వ్య‌తిరేకంగా సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇండియ‌న్స్ వాట్సాప్ స్టేట‌స్‌లో ఆప‌రేష‌న్ సింధూర్ ద‌ర్శ‌న‌మిస్తుంది. ల‌వ్ ఇండియా, ఐ ల‌వ్ ఇండియ‌న్ ఆర్మీ, జైహింద్ నినాదాలు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఇండియ‌న్ ఆర్మీకి దేశ పౌరులంతా ఏక‌కంఠంతో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment