ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) జరగనున్న సిరీస్‌కు ముందు భారత (India) క్రికెట్ జట్టులో (Cricket Team) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే (ODI) జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యాల (Hardik Pandya) ఫిట్‌నెస్‌పై (Fitness) ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు బెంగళూరులోని (Bengaluru) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (Centre of Excellence) హాజరై ఫిట్‌నెస్ పరీక్షలు, రీహాబిలిటేషన్ (Rehabilitation) కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం కాగా, రోహిత్ శర్మ ఎప్పుడు హాజరవుతాడనే అంశంపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు సన్నాహకాల్లో భాగంగా పలువురు యువ బౌలర్లకు అవకాశం కల్పించింది. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను (Aaqib Nabi Dar) నెట్ బౌలర్‌గా ఎంపిక చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన లెగ్ స్పిన్నర్ జీషాన్ అంసారీతో (Zeeshan Ansari)పాటు మరికొందరు యువ బౌలర్లను కూడా జట్టుతో కలిపారు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ దళాన్ని ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లకు మెరుగైన ప్రాక్టీస్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టు ఎంపికలు, ఫిట్‌నెస్ అప్‌డేట్లు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.









‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు