ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీల‌ను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరాలు వెల్లడించారు.

డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి, అవసరమైన స్థాయిలో పెంపుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రోత్ కారిడార్లు (Growth Corridors) మరియు భూమి విలువ ఎక్కువగా పెరిగిన ప్రాంతాల్లో ఈ పెంపుదల ఉంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసమే రిజిస్ట్రేషన్ విలువలను సవరించాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు.

అమరావతి 29 గ్రామాల్లోని భూముల‌కు రిజిస్ట్రేష‌న్ వ్యాల్యూ పెంచబోమ‌ని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు. అదే విధంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లోనూ భూమి విలువ‌ పెరిగే అవకాశం ఉంద‌ని త‌ద్వారా రిజిస్ట్రేష‌న్ వ్యాల్యూ కూడా పెరుగుతుంద‌న్నారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో బాదుడు
కాగా, రిజిస్ట్రేష‌న్ చార్జీల పెంపు పేరుతో ప్ర‌జ‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో భారం మోపుతోంద‌ని విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే విద్యుత్ చార్జీలు, నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెంపుతో ప్ర‌జ‌ల జేబులు ఖాళీ అవుతుండ‌గా, రిజిస్ట్రేష‌న్లు చార్జీల పేరుతో మ‌రో బాదుడుకు కూటమి సిద్ధ‌ప‌డుతోంద‌ని, త్వ‌ర‌లో జిల్లా ర‌హ‌దారుల‌కు టోల్ గేట్ల రూపంలో మ‌రో బాదుడుకు సిద్ధంగా ఉండాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment