ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రజలకు చేసిందేమీ లేక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలకు రంగులు, స్టిక్కర్లు మారుస్తూ ప్రచార ఆర్భాటం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతంగా ఒక కొత్త పథకం, ఒక కొత్త వాహనం గానీ, ప్రాజెక్టు గానీ తెచ్చిన పాపాన పోకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సేవలను తమవిగా రీబ్రాండింగ్ చేసుకుంటుందని, తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగుచూసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
పాత వాహనాలకు కొత్త పెయింటింగ్..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధర్మవరం పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో కొనుగోలు చేసిన 71 ‘108’ అంబులెన్సులను, 104 సంచార చికిత్స వాహనాలను మళ్లీ జెండా ఊపి ప్రారంభించడంపై స్థానికులు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
గత జగన్ ప్రభుత్వంలో గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం తెచ్చిన 108, 104 వాహనాలకు కేవలం రంగులు, స్టిక్కర్లు మార్చేసి తమ కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా నిరంతరాయంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలకు సేవలందిస్తున్న వాహనాలకే మళ్లీ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి జెండా ఊపడం, వాటిని ఆరోగ్య రథకాలుగా చెప్పుకోవడం కూటమి నాయకుల ప్రచార పిచ్చికి పరాకాష్ఠ అని ప్రజా సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త ప్రాజెక్టు ఏది?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వేల సంఖ్యలో నూతన 108, 104 అంబులెన్సులను కొనుగోలు చేసి, విలేజ్ క్లినిక్ లతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు. కానీ, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి పేర్లు మార్చి, కొత్త స్టిక్కర్లు వేసి ప్రజలను మభ్యపెడుతోందని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
- పేర్లు మార్చడమే గొప్పతనమా?
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి పేరు మార్చడం, వైఎస్సార్ సంచార చికిత్స వాహనాలకు స్టిక్కర్లు మార్చడం తప్ప కొత్తగా ఒక్క కొత్త పథకం తెచ్చారా?
- జగన్ హయాంలోనే నిర్మాణ పనులు పూర్తయిన ప్రాజెక్టులకు, ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాలకు రిబ్బన్లు కట్ చేస్తూ తామేదో సాధించామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడం కాదా?
- రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం సొంతంగా తెచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదా కొనుగోలు చేసిన ఒక్క కొత్త వాహనం కూడా లేకపోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోందని వైసీపీ విమర్శిస్తోంది.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు!
స్టిక్కర్లు మార్చి, రంగులేసి తమ ఖాతాలో వేసుకోవడమే పరిపాలన అనుకుంటే చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే సత్తా లేక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి క్రెడిట్ కొట్టేయడానికే కూటమి నేతలు పరిమితమయ్యారని ధర్మవరం వేదికగా చర్చ జోరుగా సాగుతోంది.
స్టిక్కర్లు మార్చి.. పెయింటింగ్ వేసి.. కొత్తవిగా ప్రారంభం
— Telugu Feed (@Telugufeedsite) September 26, 2026
వివాదంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
108 వాహనాలకు స్టిక్కర్లు మార్చి పాత వాహనాలను ఆర్భాటంగా ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
వైఎస్ జగన్ హయాంలో 2023లో కొనుగోలు చేసిన 71 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించిన… pic.twitter.com/8IMnkPXTyk








