జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు!

Summarize with AI

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టు వద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఉగ్రవాదుల కాల్పులకు సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల గుర్తింపు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment