పదేళ్ల ప్రేమకు పెళ్లి బంధం.. ప్రియా భవానీ శంకర్ సడన్ సర్‌ప్రైజ్!

పదేళ్ల ప్రేమకు పెళ్లి బంధం.. ప్రియా భవానీ శంకర్ సడన్ సర్‌ప్రైజ్!

Summarize with AI

తమిళ నటి ప్రియా భవానీ శంకర్ వివాహం చేసుకున్నారనే వార్త ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కాలేజీ రోజుల నుంచి తనకు పరిచయమైన ప్రియుడు రాజ్ వేల్ రాజ్‌తో పదేళ్లుగా కొనసాగుతున్న ప్రేమను వివాహ బంధంగా మార్చుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియా.. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎదిగారు. ‘మేయాద మాన్’, ‘తిరుచిత్రంబలం’, ‘భారతీయుడు 2’, ‘డిమాంటీ కాలనీ 2’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇటీవల ‘ఇరుముడి’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్రియా భవానీ శంకర్.. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే వివాహ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి ముందస్తు ప్రకటన లేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment