ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బీసీల (BCs చుట్టూ మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఒకవైపు ‘జయహో బీసీ’ (Jaiho BC) అంటూ 34 శాతం రిజర్వేషన్లు (34% Reservations) ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు ఎదుగుతున్న బీసీ నాయకులపై చంద్రబాబు సర్కార్ (Chandrababu Government) కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు(Dr. Seediri Appalaraju), ఆమదాలవలసకు చెందిన బీసీ నేత చింతాడ రవికుమార్(BC Leader Chintada Ravikumar) వ్యవహారాలు ఈ చర్చకు కేంద్రంగా మారాయి.
బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడం, వారికి పదవులు ఇవ్వడం, ఆర్థికంగా అండగా నిలవడం వంటి అంశాలతో పాటు, బీసీ వర్గాలకు చెందిన నాయకులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా ఇప్పుడు రాజకీయ చర్చలో కీలకంగా మారుతోంది.
శ్రీకాకుళం జిల్లాకు (Srikakulam District) చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వ్యవహారం ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేని అప్పలరాజుపై హత్యకు ప్రేరేపించడం, కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఇటీవల ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇది కేవలం అక్రమ కేసు మాత్రమే కాదని, రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకుడిని లక్ష్యంగా చేసుకున్న కక్షసాధింపు చర్యగా చూడాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అప్పలరాజును పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) వెళ్లిన సమయంలో భారీగా జనసందోహం తరలిరావడం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో మరో బీసీ నేత చింతాడ రవికుమార్‌పై కేసులు నమోదవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని వైసీపీ(YSRCP) ఆధారాలను సైతం బయటపెట్టింది. కూతురు అడ్మీషన్ కోసం పంజాబ్ వెళ్లిన వ్యక్తిని సైతం ఎఫ్ఐఆర్లో చేర్చడంతో ఇది కక్షసాధింపు చర్యగా అని తేలిపోయింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చింతాడ రవిపై కేసులు పెట్టారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అప్పలరాజు, చింతాడ రవికుమార్ ఇద్దరూ బెయిల్‌పై (Bail) విడుదలైన అనంతరం వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రభుత్వ వేధింపులు, తమపై నమోదైన కేసుల వివరాలను జగన్‌కు వివరించారు. వారి సమస్యలను విన్న జగన్.. ధైర్యంగా ముందుకు సాగాలని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు సమాచారం. బీసీ నాయకులకు రాజకీయంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇద్దరు బీసీ నేతలను జగన్ తన ప్రెస్మీట్లో పక్కనే కూర్చోబెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. చేయని తప్పునకు బీసీ నేతలను చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తే.. జగన్ తన పక్కనే కూర్చోబెట్టుకొని గౌరవించారని కామెంట్స్ చేస్తున్నారు.
బీసీలకు మేలు చేసింది ఎవరు..?
ఇదే సమయంలో బీసీల రాజకీయ సాధికారత విషయంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని (YSRCP Government) ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో (Coalition Government) పోల్చే చర్చ కూడా మొదలైంది. వైసీపీ వాదన ప్రకారం.. జగన్ ఐదేళ్ల పాలనలో ముగ్గురు బీసీలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. నాలుగు రాజ్యసభ స్థానాలు, 11 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చినట్లు ఆ పార్టీ చెబుతోంది.
అదే విధంగా నామినేటెడ్ పదవులు(Nominated Posts), పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశామని వైసీపీ పేర్కొంటోంది. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. బీసీలను ‘బ్యాక్వర్డ్ క్లాసెస్’గా కాకుండా ‘బ్యాక్‌బోన్ క్లాసెస్’గా(Backbone Classes) గుర్తించామని ఆ పార్టీ తన పాలనను వివరిస్తోంది.
బీసీల ఆర్థిక సాధికారత విషయంలోనూ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైసీపీ గుర్తుచేస్తోంది. ఐదేళ్లలో ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీల ద్వారా బీసీ కుటుంబాలకు రూ.1.83 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు ఆ పార్టీ వాదిస్తోంది. 2024 ఎన్నికల్లో 48 అసెంబ్లీ, 11 లోక్‌సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చామని, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్ వంటి పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం కల్పించామని వైసీపీ పేర్కొంటోంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చంద్రబాబు చెబుతున్నట్లు బీసీల సంక్షేమం అనేది కేవలం రిజర్వేషన్లు ప్రకటించడం కాదు. బీసీ నాయకులు రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించడం, వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం, అదే సమయంలో వారి మీద నమోదయ్యే కేసులు రాజకీయ కక్షసాధింపులుగా మారకుండా చట్టపరమైన ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడడం కూడా అంతే ముఖ్యమని విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వం రాజకీయంగా ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు బీసీ నాయకులపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు, రాజకీయ వేధింపుల ఆరోపణలు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ‘బీసీలకు రిజర్వేషన్ల పేరిట ప్రచారం.. బీసీ యువ నాయకులపై కేసులు’ అనే విరుద్ధ రాజకీయ వాదనపై చర్చ కొనసాగుతోంది.








